చరిత్ర సృష్టించిన పీవీ సింధు

Updated By ManamTue, 08/28/2018 - 13:09
pv sindhu
Asian Games 2018-PV sindhu

జకర్తా : ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బ్యాడ్మింటన్ వుమెన్స్ సింగిల్స్‌ ఫైనల్స్‌లో రజిత పతకం సాధించింది. దీంతో  ఆసియా క్రీడాల్లో తొలిసారి రజిత పతకం సాధించిన ఘనతను సింధూ కైవసం చేసుకుంది.  ఇక పసిడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా... వరల్డ్ నెంబర్ వన్ తైజుంగ్ చేతిలో పీవీ సింధూ 13-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది. 

అయితే  పీవీ సింధును ఫైనల్ ఫోబియా వీడటం లేదు. దీంతో ఆమె రజిత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్స్‌లో తీవ్ర ఒత్తిడికి లోనైన సింధూ పదే పదే తప్పులు చేయడంతో వరుసగా రెండు సెట్లు కోల్పోయింది. కాగా సైనా నెహ్వాల్ కూడా సెమీ ఫైనల్స్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

English Title
PVSindhu gets sliver after losing to Taipeis Tai Tzu Ying in Asian Games 2018
Related News