రాజ్యహింస వ్యతిరేక మహాసభలు

Updated By ManamTue, 07/17/2018 - 01:03
Martyrs Families in telangana

రాజ్యహింసకు వ్యతిరేకంగా అమరుల బంధుమిత్రుల సంఘం అనేక నిర్బంధాల మధ్య నిలబడి సాహసోపేతమైన imageపోరాటాన్ని నడుపుతున్నాం.  అమరుల ఆశయాలను ఎత్తిపడుతూ 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఎన్నో ప్రభుత్వ దాడులను, జైలు నిర్బంధాలను దాటుకుంటూ వచ్చాం. చివరికి సంఘ అధ్యక్షుడు గంటి ప్రసాదాన్ని కిరాయి హంతకులతో ప్రభుత్వం హత్య చేయించి, విప్లవోద్యమం పక్షాన నిలబడినందుకే రక్తసంబంధీకుడైన ప్రొఫెసర్ సాయి బాబాకు జీవిత ఖైదు విధించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డల శవా లను చూసిన బాధ ముందు ప్రభుత్వం ప్రయోగిస్తున్న ఈ దమనకాండ పెద్ద దేమీ కాదు. వారి త్యాగాల స్ఫూర్తితో ఈ నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ అమరుల ఆశయాలను ఏబీఎంఎస్ ఎత్తిపడుతోంది. ఈ సంవత్సరం పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో వరంగల్ జిల్లా రాంపేటకు చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, అట్లాగే గడ్చిరోలి పాశవిక మారణకాండలో జైశంకర్ జిల్లాకు చెందిన రౌతు విజయేందర్ అలియాస్ శీను అమరులయ్యారు. ఈ రెండు సంఘటనల్లో కూడా పదుల సంఖ్యలో విప్లవకారులు అశువులుబాశారు. 

ఈ ఏడాది ఆరంభం నుంచి ఎన్‌కౌంటర్ హత్యాకాండ పెరిగిపోయింది.   ఇప్పటికి దాదాపు వందమందికి పైగా విప్లవకారులను, ప్రజలను హత్య చేశారు. వీటన్నిటిలోకి గడ్చిరోలి ఘటనలో చుట్టుముట్టి 42 మందిని హత్య చేశారు. ఈ అన్ని హత్యాకాండల్లో పాతికేళ్లలోపు యువతీ యువకులే ఎక్కువ మంది ఉన్నా రు.  మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ ప్రాంతంలో గత ఏప్రిల్ 22, 23 తేదీల్లో తాండ్‌గాంవ్ అడువుల్లో భారత రాజ్యం మానవహననానికి పాల్ప డింది. సి60, సీఆర్పిఎఫ్ వందల సంఖ్యలో బలగాలు అత్యాధునిక ఆయుధా లతో సిరొంచ, అహెరీ ప్రాంతాలను చుట్టుముట్టి  ఏక పక్ష కాల్పులు జరిపాయి. గత డిసెంబర్‌లో ఆహిరి ప్రాంతంలో 9 మంది విప్లవకారులను హత్యచేశారు. మార్చి నెల 2వ తేదీ చత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో 10 మంది విప్లవకారులను హత్య చేశారు. ఇవిగాక నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్‌కౌంటర్ హత్యాకాండ జరుగుతూనే ఉంది.  కేంద్రంలో, రాష్ట్రాల్లో ఏ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అన్నిటికీ తమ రాజకీయ ప్రత్యర్థి  మావోయిస్టు ఉద్యమం మాత్రమే అనే స్పష్టత ఉంది. అందుకే ఇలా ఏకపక్ష సైనిక దాడులు జరుగుతున్నాయి.

ఇది సైనిక చర్యలకు సంబంధించిందే కాదు. రాజకీయార్థిక రంగాలకు చెందింది. అందుకే మావోయిస్టు రహిత భారత దేశమని  అన్ని పాలక పార్టీలూ ఒకే వైఖరి ప్రకటిస్తున్నాయి.  దీనికోసం దేశ వ్యాప్తంగా వివిధ రకాల ఆపరేషన్లు, అభయాన్ల పేరుతో విప్లవోద్యమాన్ని అణిచి వేస్తున్నారు. బస్తర్‌లో ఆపరేషన్ బస్తర్, ఎఓబిలో ఆలౌట్ వార్-2, ఒడిశాలో హంటింగ్ మావోయిస్టు మిషన్, కేరళలో ఆపరేషన్ థండర్ బోల్ట్, జార్ఖండ్‌లో ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సరండా పేర్లతో దాడులను నిర్వ హిస్తున్నది. ఏప్రిల్ మొదటి వారంలో జార్ఖండ్ విప్లవోద్యమ ప్రాంతంలో నాలుగు రోజులపాటు కార్పెట్ బాంబింగ్ జరిగింది. కార్గిల్ యుద్ధంలో అనుస రించిన ఈ తరహా దాడి ఆ తర్వాత జార్ఖండ్‌లో ఆదివాసులపై చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో వైమానిక దాడులకు (డ్రోన్లు, హెలికాఫ్టర్ దాడులకు) కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ అనుమతి ఇచ్చాడు. ఇప్పుడు గత కొన్నేళ్లుగా  చేప ట్టిన అన్ని అభియాన్లను  కేంద్రం ‘ఆపరేషన్ సమాధాన్ - 2022’ కిందికి తీసు కువచ్చింది. 2022 నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతమొందించడం దీని లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. రెండు తెలుగురాష్ట్రాలు కూడా గోదా వరి పరివాహక ప్రాంతంలో రక్షణ కారిడార్ పేరుతో ఆదివాసులపై డ్రోన్, హెలి కాప్టర్ దాడులు చేస్తున్నది. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా దండకారణ్యంలో గ్రామాలను తగలబెట్టడం, ఆస్తుల ధ్వంసం చేయడం, క్రాంతికారీ జనతన సర్కార్ నిర్మించిన పాఠశాలలను కూల్చి వేయడం నిత్య కృత్యమైంది. ఆదివాసీ మహిళలు, బాలికలపై అత్యాచారాలకు లెక్కేలేదు. వంద ల మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. బెయిళ్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ స్థితి గడ్చిరోలి కూడా కొనసా గుతున్నది. నిజానికి ప్రభుత్వ పాలనాపరంగా చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి వేర్వేరు కావచ్చుగాని, విప్ల వోద్యమానికి అదంతా దండకారణ్యం. అలాగే అక్కడి విప్లవోద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలన్నీ ఒకే విధానం అమలుచేస్తున్నాయి. విప్ల వోద్యమ ప్రాంతాల్లో ఈ రకమైన హత్యా కాండ జరుగుతోంటే దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఒక్కోచోట ఒక్కోరూపంలో రాజ్యహింస చెలరేగిపోతోంది.

 200 ఏళ్ల కిందటి బ్రాహ్మణీయ రాజరిక పాలనపై దళితులు చేసిన యుద్ధంలో అశువులు బాసిన వారిని స్మరించుకొనే భీమా కొరేగావ్ స్మారకాన్ని సంఘ్ పరివార్ రాజ్యం రక్తంసిక్తం చేసింది. 2017 డిసెం బర్ 31, జనవరి 1న చేసిన మూకుమ్మడి దాడి లో ముగ్గురిని బలి తీసుకున్నది. ఢిల్లీ, నాగపూర్‌లలో దళిత, విప్లవ ప్రజాసంఘాల నాయకులను, మేధావులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఢిల్లీలో ఉండే రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ప్రజా సంబంధాల కార్యదర్శి రోనా విల్సన్, నాగపూర్‌లో సుప్రసిద్ధ న్యాయవాది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్ (ఐఎపిఎల్) జన రల్ సెక్రెటరీ సురేంద్ర గాడ్లింగ్, మూడు దశాబ్దాలుగా సాంస్కృతిక రంగంలో పనిచేస్తూ, ‘విద్రోహి’ పత్రిక వ్యవస్థాపకుడిగా, రిపబ్లికన్ పాంథర్స్ నాయకుడిగా ఉన్న సుధీర్ ధావ్‌లే, విప్లవోద్యమ అవగాహనతో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్న నాగపూర్ యూనివర్సిటీ ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్, విమెన్స్ స్టడీస్ హెడ్  షోమాసేన్,  బి.డి.శర్మ స్థాపించిన భారత్ జన్ ఆందోళన్ నాయకుడు, విస్థాపన్ విరోధి కమిటీ అఖిల భారత కార్యవర్గ సభ్యుడు మహేష్ రావత్ ఉన్నారు.  ఇప్పుడు భీమా కొరేగావ్‌ను సంఘ్ రాజ్యం దళిత, ప్రగతిశీల, విప్లవ శక్తుల దాడిగా, కుట్రగా, విద్రోహంగా, హింసగా వక్రీ కరిస్తున్నది. అరెస్టుల పరంపర నుంచి తప్పుడు కథనాలు చిత్రించి ప్రధాని మోదీ హత్యకు పౌర జీవితంలో ఉండే ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, రచయితలతో కలిసి మావో యిస్టు పార్టీ కుట్రపన్నిందని ప్రచారం చేస్తున్నారు. ఇందులో విరసం నాయకుడు వరవరరావు పేరు కూడా ఇరికించారు. వీటన్నిటి కంటే ముందే రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకుడైన హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పా రావును హత్య చేయడానికి మావోయిస్టులతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణ చేసి విశ్వవిద్యాలయ విద్యార్థులు అంకాళ్ల పృథ్వీ (విరసం సభ్యుడు కూడా), చందన్‌లను అరెస్టు చేశారు. విద్యారంగంలో కార్పొరేట్‌ల నిరంకుశత్వాన్ని ప్రశ్ని స్తున్న డీఎస్‌యూ విద్యార్థులు బద్రి, రంజిత్, సుధీర్‌లను, టీడీఎఫ్ నాయకుడు దుర్గాప్రసాద్‌ను  ప్రభుత్వం అక్రమంగా అరెస్టుచేసి జెయిల్లో పెట్టింది.  

కార్పొరేట్లను ప్రశ్నిస్తే వాళ్ల తరపున రాజ్యం ఎంత దుర్మార్గానికైనా పాల్ప డుతోంది. దీనికి తమిళనాడులోని తూత్తుకుడిలో వేదాంత కంపెనీ నడుపుతున్న రాగిని ఉత్పత్తి చేసే స్టెరిలైట్ కంపెనీ వల్ల తమ జీవితాలు నాశనమైపోతున్నా యని, మూసేయాలని ప్రజలు కోరడమే నేరమైంది. ఆందోళనకారులైపె పోలీసు లు జరిపిన కాల్పుల్లో 13 మంది హతులయ్యారు. ఇక కశ్మీర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. స్వేచ్ఛాకాంక్ష కోసం, విముక్తి కోసం దశాబ్దాల తరబడి నిత్యం నెత్తురోడే నేల అది. దండకారణ్యంలో, కశ్మీర్‌లో ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి. దేశమంతా విప్లవోద్యమాలు, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, కశ్మీర్ తరహా జాతివిముక్తి పోరాటాలు, వివిధ రూపా ల్లో కార్పొరేట్ల వ్యతిరేక పోరాటాలు, ప్రాంతీయ సమానత్వ పోరాటాలు, హిందు త్వ దురహంకారానికి వ్యతిరేకంగా వివిధ సెక్షన్ల ప్రజాస్వామిక పోరాటాలు వెల్లు వెత్తుతున్నాయి.

దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనను ఐక్యరాజ్యసమితి సహితం విమర్శించింది. కశ్మీర్, ప్రొఫెసర్ సాయిబాబ అక్రమ జెయిలు నిర్బంధం గురించి ప్రస్తావించింది. అమరవీరుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్‌కౌంటర్ హత్యలకు, కుట్రకేసులకు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 4వ మహాసభలు ఈ 17న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సుభాష్‌నగర్‌లో మధ్యాహ్నం రెండుగంటలకు, 18వ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండు రోజులు నిర్వహిస్తున్నాం. 
- అమరుల బంధుమిత్రుల సంఘం

English Title
రాజ్యహింస వ్యతిరేక మహాసభలు
Related News