‘యన్‌టిఆర్‌’లో రాశిఖన్నా.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ

Updated By ManamThu, 09/06/2018 - 14:29
Raashi Khanna

Raashi Khannaబాలకృష్ణ ప్రధానపాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్‌టిఆర్’. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటుండగా.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంలో జయప్రద పాత్రలో బబ్లీ గర్ల్ రాశిఖన్నా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇవి కాస్త ఆమె వరకు చేరడంతో వాటిపై రాశిఖన్నా స్పందించింది.

తను ఈ చిత్రంలో ఇంకా భాగం అవ్వలేదని తెలిపింది. యన్‌టిఆర్ చిత్రం కోసం ఎవరూ తనను సంప్రదించలేదని, మీలాగే నాకు కూడా ఇది ఓ వార్త అంటూ పేర్కొంది. కాగా రాశిఖన్నా నటించిన తమిళ చిత్రం ఇమైక్క నొడిగల్ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

English Title
Raashi Khanna about her role in NTR biopic
Related News