6.11 లక్షల మంది రైతులకు వంద శాతం నిధులు

Updated By ManamThu, 06/14/2018 - 17:29
rabi season funds, Telangana farmers, Telangana govt

rabi season funds, Telangana farmers, Telangana govtహైదరాబాద్: రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వంద శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు గురువారం పౌరసరఫరాల సంస్థ అన్ని జిల్లాలకు నిదులను విడుదల చేసింది. రబీలో 3,313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుంచి 35.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5601.97 కోట్లు. దీనికి సంబంధించి ప్రతి పైసాను ఆన్‌లైన్‌ ద్వారా రైతు ఖాతాలో జమ చేసింది. మరో రూ. 349 కోట్లను కూడా జిల్లాలకు విడుదల చేశారు. రూ. 349 కోట్లు నిధులను బ్యాంకులు పనిదినాల్లో ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు. 

పండుగను దృష్టిలో పెట్టుకొని రైతులకు చెల్లింపులతో పాటు హమాలీ, రవాణా, గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రతి పైసా చెల్లింపులు చేసి, దళారుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి కనీస మద్ధతు ధర చెల్లింపులను జమ చేయనున్నారు. పౌరసరఫరాల సంస్థ దగ్గర నిధుల సమస్య లేదని, అవసరమైన నిధులున్నాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు.

English Title
rabi season funds released for Telangana farmers 
Related News