చిక్కుల్లో రవిశాస్త్రి

Updated By ManamWed, 09/12/2018 - 00:36
ravi-shashtri

ravi-shashtriముంబై: ఇంగ్లాండ్‌లో టీమిండియా ప్రతిభ దురదృష్టకరమైన పరిస్థితి నుంచి దార్భాగ్యమైన పరిస్థితికి దిగజారింది. ఒక్క టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకోవడం తప్ప తర్వాత జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌లను కోల్పోవడం, ముఖ్యంగా టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లో, ఇన్నింగ్స్‌లో భారత క్రికెటర్లు క్రీజు వద్ద నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా కోచింగ్‌పై, కెప్టెన్సీపై, కెప్టెన్ విరాట్ కోహ్లీపై, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోచ్ పదవి నుంచి శాస్త్రిని తప్పించాలన్న వాదనలూ అధికమవుతున్నాయి. ఇంగ్లాండ్‌లో టీమిండియా ఆట తీరుతో బీసీసీఐ షాక్‌కు గురైంది. దీంతో ఈ పేలవ ప్రదర్శనలకు కారణమేంటని 56 ఏళ్ల కోచ్ రవిశాస్త్రిని బీసీసీఐ నిలదీయనుంది. జనవరిలో సౌతాఫ్రికా పర్యటన విషయంలోనూ అక్కడి వాతారణానికి అలవాటు పడేంత సమయం కూడా ఇవ్వలేదని గతంలో కొన్ని వార్గాల వాళ్లు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ను (సీఓఏ) విమర్శించారు. ఆ సిరీస్‌లో టీమిండియా 1-2తో సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఈసారి సీఓఏ ఆ తప్పును సరిదిద్దుకుంది.

 ఇంగ్లాండ్ వాతావరణానికి కోహ్లీ సేన అలవాటు పడేందుకు టెస్టు సిరీస్ కంటే ముందే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లను ఏర్పాటు చేసింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి టీమిండియాను సరిగా నడిపించడం లేదనేది ఎక్కడ చూసినా ప్రధాన చర్చగా కొనసాగుతోంది. ముఖ్యంగా సత్తా చాటడంలో టీమిండియా విఫలమైనప్పుడు శాస్త్రి జోక్యం చేసుకోవడం లేదు. అంతేకాదు విలేఖరుల సమావేశంలో కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవడం ఇండియన్ క్యాంప్‌లో ఆయన  పాత్రపై అనేక వేళ్లు శాస్త్రి వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. శాస్త్రిని కోచ్ పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే అనేక గొంతుకలు వినిపిస్తున్నాయి. టీమిండియా వరుస వైఫల్యాలతో శాస్త్రి తీవ్రమైన చిక్కుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలో కోచ్‌గా శాస్త్రి కొనసాగడం అనుమానంగా మారింది. అయితే సహజంగానే మొండి వైఖరిని ప్రదర్శించే రవిశాస్త్రి సీఓఏతో సమావేశంలో టీమిండియా వైఫల్యాలకు ఏమని సమాధానం చెబుతారో అని భారత క్రికెట్ పండితులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English Title
Racism in trouble
Related News