కమర్షియల్ రియల్టీవైపు ఆర్‌కాం అడుగులు

Updated By ManamWed, 09/19/2018 - 00:23
anil

anilముంబై: ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని రుణాల భారంతో కుంగుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రణాళిక రూపొందిస్తోంది. నవీ ముంబైలో 133 ఎకరాల విస్తీర్ణంలో రిజిస్టరైన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్‌లో 3 కోట్ల చదరపుటడుగుల కమర్షియల్ స్పేస్ సృష్టించాలని నిర్ణయించుకుంది. ఎంటర్‌ప్రైజ్, జి.సి.ఎక్స్ వ్యాపారాలను నగదుగా మార్చుకోవాలని కూడా ఈ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ భావిస్తోంది. కంపెనీ షేర్‌హోల్డర్ల 14వ వార్షిక సర్వ సభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఆర్‌కాం చైర్మన్ అనిల్ అంబానీ మంగళవారం ప్రసంగించారు. ‘‘ఆర్ కాం దాని ఇండియా ఎంటర్‌ప్రైజ్‌ను, జి.సి.ఎక్స్ వ్యాపారాలను నగదుగా మార్చుకుంటుంది’’ అని ఆయన ప్రకటించారు. ఆర్‌కాం అనుబంధ సంస్థ గ్లోబల్ క్లౌడ్ ఎక్చ్సేంజ్ (జి.సి.ఎక్స్)కి దేశంలోనే అతి పెద్ద డాటా సెంటర్ ఉంది. ఇది నాలెడ్జ్ సిటీలో ఉంది. ఇది 4.5 లక్షలకు పైగా చదరపుటడుగుల బిల్టప్ ఏరియాతో, 6,000 ర్యాక్ కెపాసిటీతో ఉంది. ఐడీసీ-5గా పిలుచుకునే ఈ కేంద్రం గ్రీన్ డాటా సెంటర్‌గా పేరొందింది.

జి.సి.ఎక్స్ కొత్త ఈగల్ సబ్‌సీ నెట్‌వర్క్‌కి ల్యాండింగ్ స్టేషన్ నెలకొల్పుతోంది. జి.సి.ఎక్స్ నిర్మిస్తున్న ఈ సబ్‌సీ కేబుల్ 2020 మూడవ త్రైమాసికం నుంచి పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. ఆస్తులను నగదుగా మార్చుకునేందుకు, మొత్తం మీద రుణ సమస్య పరిష్కారానికి దేశ, విదేశీ రుణ దాతలందరి నుంచి అనుమతి లభించినట్లు అనిల్ తెలియజేశారు. నాలెడ్జ్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కూడా కంపెనీ భావిస్తోంది. హెచ్.డి.ఎఫ్.సి రియల్టీ అధ్యయనం ప్రకారం, ఈ అభివృద్ధి ప్రాజెక్టు విలువ రూ. 25,000 కోట్లకు పైనే ఉంటుందని ఆయన చెప్పారు. ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీని అభివృద్ధి చేయడం వల్ల 75 నారిమన్ పాయింట్లకు సమానమైన వాణిజ్య ప్రదేశాన్ని సృష్టించినట్లవుతుంది. ప్రస్తుతం ముంబైలో వాణి జ్య సంస్థల కూడలిగా నారిమన్ పాయింట్‌కు ఎంతో పేరుంది. అది 10 కొత్త బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లకు సమానం కూడా అవుతుంది. మొబైల్ టెలిఫోనీ వ్యాపార రూపురేఖలు కడచిన రెండేళ్ళలో పూర్తిగా మారిపోయాయని అనిల్ అన్నారు. ‘‘మొబైల్ రంగం అనేక ఎదురుగాలులు ఎదుర్కొంటోంది. పరిమిత స్వామ్యం, ద్వంద్వస్వామ్యం లేదా ఎవరు చెప్పగలరు...ఏకస్వామ్యం కూడా ఏర్పడవచ్చని నేను  అనుకుంటున్నాను’’ అని అనిల్ చెప్పారు. ఆపరేటర్లపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. టెలికాం రంగం రూ. 7.7 లక్షల కోట్ల రుణ భారంతో కునారిల్లుతోంది. ఈ రంగంలో తీవ్ర పోటీతో ఉద్యోగావకాశాలు గత రెండేళ్ళలో సగాని కి తగ్గిపోయాయి. ఇది 20 లక్షలకు పైగా ఉద్యోగా ల నష్టానికి కారణమైందని ఆయన అన్నారు.

Tags
English Title
Rack foot towards commercial realty
Related News