‘రాఫెల్’ కొనుగోళ్లలో భారీ అవినీతి: ఉత్తమ్

Updated By ManamSat, 08/18/2018 - 17:35
Rafale defence scam, Uttam Kumar reddy, Rahul gandhi, UPA govt, PM Narendra modi

Rafale defence scam, Uttam Kumar reddy, Rahul gandhi, UPA govt, PM Narendra modiన్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఉత్తమ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో రూ.41వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఒక్కో విమానం రూ.526 కోట్లకు యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరిందని అన్నారు.

ఒక్కో విమానాన్ని రూ.1600 కోట్లకు కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. మొత్తం 36 విమానాలకు రూ.41వేల కోట్లు అధికంగా ఖర్చు చేశారని విమర్శించారు. వర్ష బీభత్సంతో అతులాకుతలమైన కేరళ రాష్ట్రంపై కూడా సమావేశంలో చర్చించామని ఉత్తమ్‌ చెప్పారు. కేరద వరదలను జాతీయ విపత్తులగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేరళకు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. తెలంగాణ పీసీసీ తరఫున కూడా సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. 

English Title
Rafale 'biggest ever' defence scam, says Uttam Kumar reddy
Related News