రాఫెల్ వివాదం: క్లారిటీ ఇచ్చిన డసాల్ట్ ఏవీయేషన్

Updated By ManamSat, 09/22/2018 - 10:15
Rafale

rafaelన్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రిలియన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవాలని స్వయంగా మోదీ ప్రభుత్వమే తమకు సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై డసాల్ట్ ఏవియేషన్ గ్రూప్ స్పష్టతను ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో తామే రిలియన్స్ గ్రూప్‌ను ఎన్నుకున్నామని ఆ సంస్థ తెలిపింది. ఇందులో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని పేర్కొంటూ ఓ అధికారిక ప్రకటనను ఇచ్చింది.  ఒప్పందాల్లో భారత సంస్థలను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచి కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నామని.. రాఫెల్‌ ఒప్పందం కోసం మేం రిలయన్స్‌ను ఎంచుకున్నామని.. ఇది మా నిర్ణయమేనని డసో ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ ట్రాపియర్‌ తెలిపారు.

అయితే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో మోదీ ప్రభుత్వమే రిలియన్స్ డిఫెన్స్‌ పేరును సూచించిందని ప్రతిపక్షం కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఆజ్యం పోస్తూ ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ చేసిన వ్యాఖ్యలు భారత్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ప్రతిపక్ష సభ్యులు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో దీనిపై డసాల్ట్ సంస్థ స్పష్టతను ఇచ్చింది.

English Title
Rafale jet controversy: Dassault Aviation clarification
Related News