'ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్ష'కు రఘువీరా పిలుపు

Updated By ManamWed, 02/21/2018 - 11:52
Raghuveera Reddy

Raghuveeraఅమరావతి: ప్రత్యేక హోదా, హక్కుల సాధన కోసం ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్షకు ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. గురువారం మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ఈ దీక్షలో ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ రఘువీరారెడ్డి పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.., రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరం కలిసి మన హక్కులను సాధించుకుందామని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని అన్నారు. ఇక ఈ దీక్షలో ఏపీసీసీ సీనియర్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరారు రఘువీరా రెడ్డి.

English Title
Raghuveera calls for Andhrula Atma Gaurava deeksha
Related News