'చిన్నారులపై లైంగిక దాడులు.. చాలా సిగ్గుచేటు'

Updated By ManamMon, 04/16/2018 - 16:02
Rahul Gandhi, Narendra Modi, fast track cases of rape of minors, crimes 'shameful'
  • నరేంద్ర మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ధ్వజం

Rahul Gandhi, Narendra Modi, fast track cases of rape of minors, crimes 'shameful' న్యూఢిల్లీ: కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో దోషులను వెంటనే శిక్షించాలని సోమవారం ఆయన డిమాండ్‌ చేశారు. ‘2016లో దేశవ్యాప్తంగా చిన్నారులపై 19,675 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఇది చాలా సిగ్గుచేటు. మన పుత్రికలకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సీరీయస్‌గా భావిస్తే.. ఈ కేసులపై విచారణ వేగవంతం చేయాలి. అత్యాచార దోషులను వెంటనే శిక్షించాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ‘స్పీకప్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్‌కు జత చేశారు. గతవారం జరిగిన ఓ కార్యక్రమంలో కథువా, ఉన్నావ్ లైంగిక దాడులకు గురైన దేశ పుత్రికలకు న్యాయం జరుగుతుందని, ఈ కేసుల్లో దోషులను వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

చిన్నారులపై లైంగిక దాడి ఘటనలపై మోదీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే రాహుల్ గాంధీ మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య చేశారు. ఉన్నావోలో 17 ఏళ్ల బాలికపై బీజీపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఆరోపించిన సంగతి విదితమే.

English Title
Rahul Gandhi asks Narendra Modi to fast track cases of rape of minors, terms such crimes 'shameful'
Related News