ఆధార్ ఉంటేనే రైల్వే టికెట్!

Updated By ManamTue, 05/08/2018 - 23:21
aadhar
  • రైల్వే శాఖ యోచన

aadharన్యూఢిల్లీ: రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా..? అయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాల్సిందే.. ఎందుకంటే ఇకపై రైల్వే టికెట్ల బుకింగ్‌కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసే అవకాశాలు కన్నిస్తున్నాయి. ఇటీవల రైల్వేశాఖకు అందిన ఓ నివేదికలో ఈ మేరకు సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులను పరిశీలిస్తున్న రైల్వేశాఖ టికెట్ బుకింగ్‌కు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నట్లు సమచారం. ఇటీవల ముంబైలో రైల్వే టికెట్ల రాకెట్ గుట్టు బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు సల్మాన్‌ఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు రూ. 1.5కోట్ల విలువ గల ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌ను విచారించేందుకు సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రైల్వే సిస్టమ్(సీఆర్‌ఐఎస్) నుంచి కొందరు సీనియర్ అధికారులు సోమవారం ముంబైకి వచ్చారు.సల్మాన్‌ను విచారించిన అనంతరం సీఆర్‌ఐఎస్, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఓ నివేదిక తయారుచేశారు. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకునేందుకు కొన్ని సిఫార్సులు చేశారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రయాణికుల యూజర్ ఐడీలను వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక..ప్రయాణికుల మొబైల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సిస్టమ్‌ను మార్చాలని ప్రతిపాదించారు. ఈ నివేదికను రైల్వేశాఖకు అందించారు. ప్రస్తుతం ఈ సిఫార్సులను రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వీటిని అమలు చేయాలనే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్లు తెలుస్తోంది

Tags
English Title
Railway ticket for Aadhaar!
Related News