ఒడిశా ప్రాంతంలో వాయుగుండం

Updated By ManamFri, 09/07/2018 - 08:55
Rain

Rainవిశాఖపట్నం: పశ్చిమ బెంగాల్‌, ఉ‍త్తర ఒడిశా పరిసరాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. జంషెడ్‌పూర్‌కు ఆగ్నేయంగా 140 కి.మీల దూరంలో, కియోనఝఘర్‌కు 130 కి.మీల దూరంలో తూర్పు ఈశాన్య దిశగా వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 24 గంటల్లో ఈ వాయు గుండం పశ్చిమ దిశగా పయనిస్తూ క్రమేణా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది.

దీంతో ఉత్తర కోస్తా, తెలంగాణలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెల్లొద్దని సూచించింది.

English Title
Rain forecast Telangana and Andhra
Related News