నానా‌పై రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు

Updated By ManamThu, 10/18/2018 - 12:48
Nana Patekar

Nana Patekarభారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’లో మొదట వినిపించిన పేరు బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్‌దే. అతడిపై తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీటూ ఉద్యమం మరోసారి రాజుకుంది. ఆ తరువాత పలువురు నటీనటులు తాము ఎదుర్కొన్న లైంగిక ఆరోపణలను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే నానా పటేకర్ ‌విషయంలో కొందరు అతడికి మద్దతు తెలిపితే.. మరికొందరు అతడు అలాంటి వాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా చీఫ్ రాజ్ థాక్రే, నానా పటేకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నానా పటేకర్ అమర్యాదస్తుడే కానీ, ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కాదని థాక్రే అన్నారు. ఏదేమైనా ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లింది కాబట్టి నిజనిజాలు బయటపడుతాయి అంటూ రాజ్ థాక్రే తెలిపారు. నానా, రాజ్ మంచి స్నేహితులు కాగా.. ఆయనకు థాక్రే మద్దతు ఇచ్చేవారని.. పదేళ్ల క్రితం అతడిపై ఆరోపణలు చేసినందుకు తనుశ్రీ ఇంటికి థాక్రే గూండాలను పంపించారని పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు రాజ్ థాక్రే పార్టీ కార్యకర్తలు తనుశ్రీ కారును ధ్వంసం చేసిన వీడియో కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English Title
Raj Thackeray comments on Nana Patekar
Related News