పూర్తిస్థాయి రాజకీయ నేత కాలేదు

Updated By ManamTue, 03/13/2018 - 20:23
rajnikanth
Rajnikanth

రాజకీయాలపై మాట్లాడేందుకు తమిళ నటుడు రజనీకాంత్ నిరాకరించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో దయానంద సరస్వతి ఆశ్రమం దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరీ నదీ వివాదంతో పాటు పలు కీలక అంశాలపై రజనీకాంత్ స్పందించడం లేదని కమల్ హాసన్ చేసిన కామెంట్స్‌పై స్పందించేందుకు రజనీకాంత్ నిరాకరించారు. ఇంకా తాను రాజకీయ పార్టీని ప్రకటించలేదని, ప్రస్తుతం తాను రాజకీయాలపై మాట్లాడబోనని చెప్పారు. ఇప్పటికీ తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు కాలేదని వ్యాఖ్యానించారు. రెండు వారాల ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా రజనీకాంత్ హిమాలయాల్లో పర్యటిస్తున్నారు. దయానంద సరస్వతి ఆశ్రమంలో కొన్ని రోజుల పాటు రజనీకాంత్ ధ్యానం చేయనున్నారు.

ఇదిలా ఉండగా రజనీకాంత్ హిమాలయాల్లో పర్యటిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

rajnikanthrajnikanth

 

English Title
Rajinikanth on spiritual visit to Himalayas, says he's not full-time politician
Related News