వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. 

Updated By ManamSun, 08/12/2018 - 09:02
Rajnath Singh, Amit Shah, Atal Bihari Vajpayee, AIIMS
  • ఎయిమ్స్‌లో పరామర్శించిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్..

Rajnath Singh, Amit Shah, Atal Bihari Vajpayee, AIIMSన్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి (93) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎయిమ్స్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కిడ్నీలో ఇన్ఫెక్షన్‌, ఛాతిలో నొప్పి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు డయాబెటిస్ ఉన్న ఆయన జూన్ 11న ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే వాజ్‌పేయి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుండగా.. దానికితోడు డిమెన్షియా కూడా ఉంది. 2009లో వాజ్‌పేయికి గుండెపోటు వచ్చింది. కాగా, వాజ్‌పేయి ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. 

English Title
Rajnath Singh, Amit Shah Call on Ailing Atal Bihari Vajpayee at AIIMS
Related News