అన్న కోసం

Updated By ManamThu, 07/19/2018 - 16:11
raksha bandan

పర్‌ఫెక్ట్ రాఖీ హ్యాంపర్, రాఖీ కాంబో, గిఫ్ట్ ఇన్ స్టైల్, ఫర్ మేరే భయ్యా, రాఖీ గిఫ్ట్ హ్యాంపర్.. ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? ఇవన్నీ త్వరలో రానున్న రాఖీ పండుగ కోసం వినూత్నంగా జరుగుతున్న సన్నాహాల్లో భాగం. 

ఆన్‌లైన్ రాఖీలు

దేశవిదేశాల్లోని మీ సోదరులకు రాఖీ పంపాలనుకుంటే జస్ట్ ఓ క్లిక్ కొడితే చాలు, మీ అన్న లేదా తమ్ముడికి ఫేవరెట్ స్వీట్, నచ్చే గిఫ్ట్‌తో పాటు రాఖీను, రాఖీ పూజా సామాను, రాఖీ గ్రీటింగ్ కార్డులు సకాలంలో అందుతాయి. ఇటీవలి కాలంలో ఈ సర్వీసులు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇక బడ్జెట్ అంటారా మీకు కావాల్సిన రేంజ్‌లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి.  పూసలు, నవరత్నాలు, బంగారు, వెండి, ఇతర మెటల్స్‌లో చేసిన రాఖీలు ఏవైనా చిటికెల్లో షిప్పింగ్ చేయించేలా ఆన్‌లైన్ స్టోర్లు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చాయి. ‘గిఫ్ట్‌ఏలవ్ డాట్ కాం’ను ఒక్కసారి చూడండి, ఎంత ఇన్నోవేటివ్‌గా ఉన్నాయో అనిపించడం ఖాయం. 

rakhi

ఇలాంటి వెబ్‌సైట్లు ఇంటర్నెట్‌లో ఇంకా చాలానే ఉన్నాయి. రొటీన్‌గా ఓ మెసేజ్ పెట్టడం, వీడియో పంపడం మాత్రమే కాకుండా వెరైటీగా మీ బ్రదర్‌ను సర్‌ప్రైజ్ చేయాలనుకుంటే ఇలాంటి సర్వీసులను బుక్ చేసుకోండి.  అప్పుడు ఈ రాఖీ పౌర్ణమి మరపురాని రోజుగా మారడం ఖాయం. మనదేశంలో ఏ మూలన ఉన్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఇలా రాఖీ శుభాకాంక్షలు చెప్పి, రక్షా బంధనాన్ని మీరు ఆస్వాదించే ఛాన్స్ టెక్నాలజీ ద్వారా కలుగుతోంది. వచ్చే నెల 26న రాఖీ పౌర్ణమి జరుగనున్న నేపథ్యంలో ఇంకా బోలెడంత టైం మీకు మిగిలే ఉంది కనుక, ఇప్పటి నుంచే రాఖీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకోండి.

raksha
English Title
raksha bandan online rakhis
Related News