అదే నాకు సంతృప్తినిస్తుంది.

Updated By ManamWed, 09/19/2018 - 05:56
rakul

imageగ్లామర్ ప్రపంచమైన సినిమా రంగంలో అందాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైంది. హీరో, హీరోయిన్ అయినా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని కోసం సినిమా తారలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఫిట్‌నెస్ అనేది చాలా అవసరం. కొంతమంది హీరోయిన్లు శారీరక వ్యాయామం లేకపోతే బ్రతకడం శుద్ద దండగ అన్నట్టుగా తెగ కష్టపడిపోతూ ఉంటారు. అలాంటివారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె ఎక్సర్‌సైజ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.

ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ ‘‘నేను రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేస్తాను. ఒక్కరోజు చేయకపోయినా నా మెదడు పనిచేయనంత బాధ కలుగుతుంది. నేను అధిక బరువులు ఎత్తడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. కనీసం గంట వ్యాయామం చేస్తే తప్ప నాకు తృప్తి ఉండదు. ఇటీవల ఒక లారీ టైర్‌ను పైనుంచి కిందికి దించి దానితో పాటు పరిగెత్తే కసరత్తుల దృశ్యాన్ని ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ విధంగా రకుల్‌కి మంచి పబ్లిసిటీయే వచ్చింది. 

English Title
rakul preethi sing
Related News