అన్నా వీడిని చంపేయాలా..? బయపెట్టాలా..?

Updated By ManamFri, 11/09/2018 - 10:18
Ram Charan's Vinaya Vidheya Rama teaser
Ram Charan's Vinaya Vidheya Rama teaser

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ టీజర్ వచ్చేసింది. ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ టీజర్‌లో రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. అలాగే అన్నా వీడిని చంపేయాలా..? భయపెట్టాలా..? భయపెట్టాలంటే పది నిమిషాలు, చంపేయాలంటే పదిహేను నిమిషాలు ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో.. ఇక్కడ రామ్.. రామ్ కొణిదెల లాంటి మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టాడు చరణ్. టీజర్‌కు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు చెర్రీ.

ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా నటించింది. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

English Title
Ram Charan's Vinaya Vidheya Rama teaser released
Related News