రామ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

Updated By ManamWed, 02/21/2018 - 12:52
ram

Ram, Trinatha rao రామ్ హీరోగా 'నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. మార్చి 16 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుండగా.. ఇందులో అనుపమ హీరోయిన్‌గా కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే గతేడాది 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో యావరేజ్ హిట్‌ను సొంతం చేసుకున్న రామ్.. ఈ మూవీతోనైనా పెద్ద సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.

English Title
Ram next movie on sets from March 16th
Related News