రామగుండం మేయర్‌గా రాజమణి

Updated By ManamTue, 09/18/2018 - 06:28
somayapu Satyanarayana
  • డిప్యూటీగా ముప్పిడి సత్యప్రసాద్.. 

  • ఐకమత్యంతోనే మేం గెలిచాం.. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

somarapuగోదావరిఖని: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మేయర్ గా 13వ డివిజన్ కార్పొరేటర్ చిట్టూరి రాజ మణి, డిప్యూటి మేయర్‌గా 19వ డివిజన్ కార్పొరేటర్ ముప్పిడి సత్యప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆగస్టు 2వ తేదీన మేయర్ కొం కటి లక్ష్మినారాయణతో పాటు డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావే శం నిర్వహించారు. ఆనంతరం 36 మంది కార్పొరేటర్లతో కలసి అవిశ్వాసం ప్రకటించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేనకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. అవిశ్వాసం నెగ్గడంతో మేయర్‌గా ఉన్న కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్‌గా ఉన్న సాగంటి శంకర్‌లను పదవుల నుండి తొలగిస్తున్నట్టు పురపాలక  పరిపాలన విభాగం కమిషనర్ ఆదేశాలను జారీ చేసారు. దీంతో నూతన మేయర్‌ను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 17న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం 11గంటలకు మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నికలను నిర్వహించి మేయర్‌గా చిట్టూరి రాజమణి, డిప్యూటి మేయర్‌గా ముప్పిడి సత్యప్రసాద్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఎన్నికల నిర్వహణను జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పరిశీలించారు. 

ఐకమత్యంతోనే విజయం సాధించాం
మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

ఐకమత్యంతోనే విజయాన్ని సాధించామని రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. రామగుండం ప్రాంతంలోని ప్రజలందరు అభివృద్ధ్దిని కోరుకుంటున్నారని అన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌లు తోటి కార్పొరేటర్లతో కలసి రామగుండం అభివృద్ధ్దికి కృషి చేయాలని సూచించారు. ఈ ఎన్నికలకు పెద్దపల్లి మాజీ ఎంపీ బాల్క సుమాన్ హజరై ఓటు హక్కును వినియోగించుకున్నారు.

English Title
Ramagundam is the mayor of Rajamani
Related News