పండంటి బాబుకు జన్మనిచ్చిన రంభ

Updated By ManamWed, 09/26/2018 - 09:15
Rambha

Rambhaఅలనాటి నటి రంభ పండంటి బాబుకు జన్మనిచ్చారు. కెనడాలోని టొరంటోలో ఈ నెల 23న బాబుకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రంభ భర్త ఇంద్రకుమార్ సోషల్ మీడియాలో వెల్లడించారు. మాకు బాబు పుట్టాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్ల నుంచి రంభకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2010లో రంభ, ఇంద్రకుమార్‌లకు వివాహం జరగగా.. ఇప్పటికే వారిద్దరికి లాన్య, సాషా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరు ప్రస్తుతం టొరంటోలో స్థిరపడ్డ విషయం తెలిసిందే.

English Title
Rambha blessed with a baby boy
Related News