రామ్‌చరణ్ ‘స్టేట్‌రౌడీ’?

Updated By ManamWed, 09/26/2018 - 01:56
ram charan

imageహీరో రామ్‌చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల మెయిన్ విలన్‌గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ తన షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియా వచ్చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాకి ‘స్టేట్‌రౌడీ’ అనే టైటిల్ పెట్టాలన్న ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. 1989లో చిరంజీవి హీరోగా ‘స్టేట్‌రౌడీ’ అనే సినిమా వచ్చింది. ఇప్పుడదే టైటిల్‌ను చరణ్ సినిమాకు ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని  అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ ‘స్టేట్ రౌడీ’ అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు.

English Title
Ramcharan state roudy?
Related News