న‌య‌న‌తార కాదు.. ర‌మ్య‌కృష్ణ‌?

Updated By ManamFri, 04/20/2018 - 23:59
ramya

ramyaస‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'యాత్ర‌'. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్న‌ ఈ చిత్రానికి మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వై.ఎస్‌.ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడా పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ర‌మ్య ఎంట్రీపై క్లారిటీ రానుంది.

English Title
ramya krishna going to play y.s.r.vijayamma's role?
Related News