నేను ఆరోగ్యంగా ఉన్నా

Updated By ManamTue, 06/19/2018 - 09:27
rana

rana టాలీవుడ్ నటుడు రానా ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ, కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నాడంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి. ఇవి కాస్త రానా వరకు చేరడంతో వాటిపై స్పందించాడు యంగ్ హీరో. తనకు బ్లడ్ ప్రెషర్ సమస్య ఉందని, అందువలనే కంటి ఆపరేషన్ లేటు అవుతుంది తప్ప తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రానా క్లారిటీ ఇచ్చాడు. తన అనారోగ్యంపై వస్తున్న వార్తలను నమ్మకండి అంటూ ఆయన చెప్పాడు.

అయితే రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 1945 అనే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న చిత్రం, కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ బయోపిక్, హథీ మేరీ సాథీ రీమేక్‌లు ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక బాల దర్శకత్వంలో ఒక చిత్రం, తేజ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు ఈ హీరో.

English Title
Rana about his health condition
Related News