నా ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయకండి

Updated By ManamSun, 06/24/2018 - 11:33
Rana

rana తన ఆరోగ్యం బావుందంటూ రానా ఇటీవలే ఒకసారి ప్రకటించనప్పటికీ.. ఆయన అనారోగ్యంపై వస్తున్న వార్తలు మాత్రం తగ్గడం లేదు. దీంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు రానా. ‘‘నా ఆరోగ్యం గురించి ఎన్నో పుకార్లు వింటున్నా, నేను బావున్నా. కేవలం బీపీ ప్రాబ్లమ్ మాత్రమే నాకు ఉంది. అది కూడా త్వరలోనే క్యూర్ అవుతుంది. మీ జాలి, ప్రేమకు ధన్యవాదాలు. కానీ నా ఆరోగ్యంపై వదంతులు మాత్రం ప్రచారం చేయకండి’’ అంటూ రానా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా ప్రస్తుతం రానా  ‘వెల్‌కం టు న్యూయార్క్’, ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’, ‘అనిళమ్ తిరునల్ మార్తాండ వర్మ’ అనే చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

English Title
Rana about his health rumours
Related News