హారర్ చిత్రంలో రానా

Updated By ManamThu, 03/15/2018 - 21:30
rana

rana‘బాహుబలి’లో భల్లాలదేవగా అందరినీ మెప్పించాడు యువ నటుడు రానా దగ్గుబాటి. అందుకే ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న సినిమాలన్నింటిల్లోనూ.. ఏదో ఒక ప్రత్యేకతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రానా. ఓ వైపు రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ‘1945’ చేస్తున్న ఈ యంగ్ హీరో.. మ‌రో వైపు మలయాళ చిత్రం ‘రాజా మార్తాండ వర్మ’లో టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. అలాగే ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘హథీ మేరే సాథీ’ అనే హిందీ చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే ‘దొంగాట’ ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం రాబిన్ హుడ్‌ టైగర్ నాగేశ్వరరావు బ‌యోపిక్ చేస్తున్నాడు.

వీటితో పాటు.. ఓ హారర్ చిత్రంలో నటించడానికి కూడా రానా ఆస‌క్తి చూపిస్తున్నాడట. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధార్థ్, ఆండ్రియా జంట‌గా ‘గృహం’ అనే హార‌ర్‌ సినిమాను తెర‌కెక్కించిన‌ మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వంలో రానా ఓ హారర్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు జరుగుతున్నాయని ఫిలింనగర్ వర్గాల టాక్.

English Title
rana in horror movie
Related News