ఆ హిట్ చిత్రాన్ని రానా వదులుకున్నాడట

Updated By ManamWed, 09/05/2018 - 09:30
Rana Daggubati

Rana Daggubatiకెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ పలు భాషల్లో దూసుకుపోతున్న రానా ఓ హిట్ సినిమాను వదులుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘C/O కంచరపాలెం’ అనే చిత్రాన్ని రానా డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. ఈ మూవీ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్లో పాల్గొన్న రానా, తాను వదులుకున్న హిట్ చిత్రాన్ని తెలిపాడు.

ఇంతకు ఆ చిత్రం ఏంటని అనుకుంటున్నారా.. ‘పటాస్’. కల్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ కథను ముందు అనిల్ రావిపూడి రానాకు వినిపించారట. అయితే అప్పుడు బాహుబలి కమిట్‌మెంట్స్ ఉండటం వలన ఈ చిత్రాన్ని చేయలేనని చెప్పాడట. ఆ తరువాత అనిల్, కల్యాణ్ రామ్‌ను కలవడం, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం, విడుదలయ్యాక హిట్ అవ్వడం.. ఇలా అన్నీ జరిగిపోయాయి. కాగా ఈ చిత్రం తమిళ్‌లో ‘మొట్ట శివ కెట్ట శివ’, కన్నడలో ‘పటాకి’, బెంగాళిలో ‘ఏసీపీ రుద్ర: ఆన్ డ్యూటీ’ అనే పేర్లతో రీమేక్ అయిన విషయం తెలిసిందే.

English Title
Rana missed that commercial hit movie
Related News