రానా.. నెల రోజులు అడ‌వుల్లోనే

Updated By ManamTue, 03/06/2018 - 21:10
rana

rana'బాహుబ‌లి' సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ న‌టుడు రానా. ప్ర‌స్తుతం ఆయ‌న చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. వాటిలో బ‌హుభాషా చిత్రం 'హాథీ మేరే సాథీ' ఒక‌టి. 1971లో వ‌చ్చిన అదే పేరు గ‌ల హిందీ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని జంగిల్ ఐలాండ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని రానా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. ''థాయ్‌లాండ్ జంగిల్ ఐలాండ్ నుంచి హ‌లో చెబుతున్నా. రాబోయే నెల రోజుల పాటు అడ‌వుల్లోనే షూటింగ్‌తో బిజీగా ఉండబోతున్నాను'' అంటూ రానా ట్వీటారు.  త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

English Title
rana new movie shooting update
Related News