'ఎంత స‌క్క‌గున్నావే'.. పాటొచ్చేసింది

Updated By ManamTue, 02/13/2018 - 17:20
ranga

rangasthalam1985 సంవ‌త్స‌రంలో చిట్టిబాబు, రామ‌ల‌క్ష్మిల మ‌ధ్య సాగిన ప్రేమ క‌థకు తెర‌ రూపం.. 'రంగ‌స్థ‌లం'. చిట్టిబాబుగా రామ్ చ‌ర‌ణ్‌, రామ‌ల‌క్ష్మిగా స‌మంత న‌టించిన ఈ చిత్రంలోని తొలి పాట ఈ రోజు (బుధ‌వారం) విడుద‌లైంది. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా 'ఎంత స‌క్క‌గున్నావే' అంటూ చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రంలో చంద్ర బోస్ సాహిత్యంతో రూపొందిన పాట‌ని ఈ రోజు (బుధ‌వారం) విడుద‌ల చేశారు. మెలోడీయ‌స్‌గా ఉన్న ఈ పాట.. విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీకి చంద్ర బోస్ సాహిత్యం తోడై వీనుల విందుగా ఈ పాట సాగింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'రంగ‌స్థ‌లం' మార్చి 30న తెర‌పైకి రానుంది.

English Title
'rangasthalam' first single released
Related News