రేపే 'రంగస్థలం' మొత్తం పాటలు

Updated By ManamWed, 03/14/2018 - 13:39
Ram Charan

Ram Charan సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'రంగస్థలం' నుంచి మరో శుభవార్త వచ్చేసింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యి సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా.. మిగిలిన రెండు పాటలతో సహా మొత్తం పాటలను గురువారం రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గురువారం ఉదయం 10గంటలకు ఈ పాటలు సోషల్ మీడియాలో రానున్నాయి. అలాగే ఉగాది రోజున వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు.

ఇక 1985లో జరిగిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత నటించగా.. జగపతి బాబు, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

English Title
Rangasthalam Jukebox will release on Thursday
Related News