సినిమా కోసం 2 కోట్లు వదులుకున్న రణ్‌వీర్

Updated By ManamTue, 02/13/2018 - 22:12
ranveer singh

ranveer singhదీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను సినీ జనాలు చాలా ఎక్కువగా ఫాలో అవుతుంటారు. రంగుల ప్రపంచంలో వీరు కాంతులు విరజిమ్మేది అతి తక్కువ కాలమే. తమ హవా నడిచే ఈ కాస్త టైంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు సినీతారలు.. ఒకపక్క సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్లు, ఈవెంట్లలో పాల్గొని.. ఎక్కడ ఎంత దొరికితే అంత క్యాష్ చేసుకోవడానికే చాలా మంది సినీ సెలబ్రెటీలు చూస్తూ ఉంటారు.

అలాంటిది పిలిచి రెండు కోట్లు ఇస్తానంటే ఎవరైనా వద్దంటారా..? కానీ అలాంటి అవకాశాన్ని వదులుకున్నాడు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్. బాజీరావ్ మస్తానీతో హిందీ జనాల్లో బాగా పాపులరైన రణ్‌వీర్... లేటేస్ట్ మూవీ పద్మావత్‌తో దేశవ్యాప్తంగా జనాల నోళ్లలో నానాడు. సినిమాలతో బిజీగా ఉన్న టైంలో మనోడికి ఓ ఆఫర్ వచ్చింది. బాగా డబ్బున్న ఓ వ్యక్తి తన ఇంట్లో జరిగే పెళ్లిలో అరగంట పాటు డ్యాన్స్ చేయాలని రణ్‌వీర్‌కి బంపరాఫర్ ఇచ్చాడట. ఇందుకోసం రూ.2 కోట్లు ముట్టచెబుతానని చెప్పాడట. అయితే అప్పటికే రణ్‌వీర్ గల్లీబాయ్ సినిమా షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. పెళ్లిలో డ్యాన్స్ చేస్తే సినిమాపై ఫోకస్ పెట్టలేనని సున్నీతంగా తిరస్కరించాడట. క్యారెక్టర్‌లో ఫర్ఫెక్షన్ కోసం కోట్లను కూడా వద్దన్న రణ్‌వీర్‌ది.. నిజంగా అరుదైన వ్యక్తిత్వం అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

English Title
ranveer singh rejected 2 crores offer
Related News