వీడియో: బస్టాండ్‌లో కామాంధులను చెప్పుతో కొట్టి.. 

Updated By ManamTue, 03/13/2018 - 15:46
Rape attempt on woman, Hubballi, Victim teaches perpetrators a lesson

Rape attempt on woman, Hubballi, Victim teaches perpetrators a lessonహుబ్లీ: మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. బస్సులో, బస్‌స్టాపుల్లో, ఆఫీసుల్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటక హుబ్లి బస్సు డిపోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు స్టేషన్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న 55 ఏళ్ల మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచార యత్నం చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన సొంతూరికి వెళ్లే చివరి బస్సు వెళ్లి పోవడంతో 55ఏళ్ల మహిళ.. ఆ రాత్రి హుబ్లీ బస్టాండ్‌లోనే నిద్రించింది. మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. భయంతో నిద్ర లేచిన మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ.. తన కాలి చెప్పును తీసి ఆ ఇద్దరి కామాంధులను చితకబాదింది. మహిళ అరుపులతో అక్కడే నిద్రిస్తున్న కొందరు వ్యక్తులు లేచి కామాంధులను చితక్కొట్టారు. పోలీసులకు అప్పగించే లోపే ఇద్దరు కామాంధులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్యాచార యత్నం చేసిన కామాంధులకు మహిళకు గుణపాఠం చెబుతున్న వీడియోను మీరూ చూడండి..  

English Title
Rape attempt on woman in Hubballi: Victim teaches perpetrators a lesson 
Related News