అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్..

Updated By ManamFri, 09/07/2018 - 16:09
Rapole Bhaskar, Petition in High court, Telangana Assembly dissolve
  • పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ 

  • మంగళవారం విచారించనున్న హైకోర్టు

Rapole Bhaskar, Petition in High court, Telangana Assembly dissolveహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఇంకా 9 నెలలు కొనసాగాల్సి ఉండగా ముందే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు అధికారాన్ని యిచ్చారని, కానీ, 9 నెలల కాలం ఉండగానే ముఖ్యమంత్రి సరైన కారణాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలను నిర్వహించడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని భాస్కర్ ప్రస్తావించారు. ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో భాస్కర్ కోరారు. రాపోల్ భాస్కర్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 
Rapole Bhaskar, Petition, High court, Telangana Assembly dissolve

English Title
Rapole Bhaskar files a Petition in High court on Telangana Assembly dissolve




Related News