విజయ్‌కు అరుదైన అవార్డు

Updated By ManamMon, 09/24/2018 - 11:49
Vijay

Vijayకోలీవుడ్ నటుడు విజయ్ మరో అరుదైన అవార్డును అందుకోనున్నారు. లండన్‌కు చెందిన ఐరా అనే ఓ అవార్డు ఆర్గనైజేషన్ ఉత్తమ అంతర్జాతీయ నటుడిగా విజయ్‌ను ప్రకటించింది. గతేడాది విజయం సాధించిన ‘మెర్సల్‌’ చిత్రంలో నటనకుగానూ ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ విషయం తెలిసిన తమిళులు సంతోషం వ్యక్తం చేయగా.. విజయ్ అభిమానులు సంబరాలను జరుపుకుంటున్నారు.

కాగ మురగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన సర్కార్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

IARA

 

English Title
Rare honor for Vijay 
Related News