నా పెళ్లి ఆగిపోయిందా..!

Updated By ManamFri, 08/17/2018 - 10:30
Rashmika Mandanna

Rashmika Mandanna‘ఛలో’తో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక మందన్న, ‘గీత గోవిందం’తో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో నాని సరసన దేవదాస్, విజయ్ దేవరకొండ సరసన కామ్రేట్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే కిర్రిక్ పార్టీతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ చిత్ర హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. గతేడాది ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే వారిద్దరు నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇవి కాస్త రష్మిక వద్దకు చేరడంతో వాటిపై ఆమె స్పందించింది.

తామిద్దరం రెండున్నరేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు నటనలో బిజీగా ఉండటంతో పెళ్లి చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని తెలిపింది. తమ పెళ్లి ఆగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇక గీత గోవిందం సినిమా కోసం దాదాపు ఏడున్నర నెలలు పనిచేశానని, అందులో ఏడు నెలల పాటు కోపంతో నటిస్తే, చివరి 15రోజులు మాత్రం సరదాగా గడిపానని తెలిపింది.

English Title
Rashmika Mandanna about her marriage
Related News