కేరళలో ర్యాట్ ఫీవర్.. 15మంది మృతి

Updated By ManamMon, 09/03/2018 - 12:31
Rat Fever

Rat Feverతిరువనంతపురం: భారీ వర్షాలతో అల్లకల్లోలమై, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళను అంటువ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. వర్షం తరువాత అక్కడి ప్రజలను పలు అంటువ్యాధులు బాధపెడుతుండగా.. వాటిలో ర్యాట్ ఫీవర్ వలన ఇప్పటివరకు 15మంది మరణించారు. మరోవైపు 350మంది ఈ వ్యాధి బారిన పడ్డారని.. కోళికోడ్, మలప్పురం జిల్లాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

దీనిపై మా్టాడిన ఆ రాష్ట్ర వైద్యాశాఖ మంత్రి కేకే శైలజ.. బాధితులు ఆందోళన చెందొద్దని, అన్ని హెల్త్ సెంటర్లు, ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందుల్ని ఉంచామని పేర్కొన్నారు. కాగా అనారోగ్యం దృష్ట్యా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే.

English Title
Rat Fever kills 15 members in Kerala
Related News