కర్నూలులో రేవ్ పార్టీ కలకలం

Updated By ManamFri, 11/09/2018 - 14:40
Rave party
  • ఎరువుల కంపెనీ ఏజెంట్లకు విందు

  • మద్యం తాగి మహిళలతో అశ్లీల నృత్యాలు

  • గతంలోనూ రేవ్‌పార్టీ.. పట్టుకున్న షీ టీమ్

Rave partyకర్నూలు క్రైమ్: ఇన్నాళ్లూ హైదరాబాద్, బెంగుళూరు, తదితర మెట్రో నగరాలకే పరిమితమైన రేవ్ పార్టీలు కర్నూలుకు కూడా చేరుకుంటున్నాయి. నగరం నడిబొడ్డున బుధవారం జరిగిన రేవ్ పార్టీ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక శరీన్ నగర సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎరువుల కంపెనీ ఒకటి తమ డీలర్లకు విందు ఏర్పాటు చేసింది.

నిర్ణీత సమయానికి అమ్మకాలు బాగా జరపడంతో.. ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలను తీసుకువచ్చి విందులో చుక్క, ముక్కతో పాటు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఎంజాయ్ చేశారు. మద్యం తాగిన కొంతమందికి కిక్కు ఎక్కి నృత్యం చేస్తున్న మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ మొదలైంది.

దాంతో రేవ్ పార్టీని అర్ధాంతరంగా ముగించారు. గతంలో కూడా రాజవిహార్ సెంటర్లోని ఒక హోటల్లో ఫర్టిలైజర్ డీలర్లు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి షీటీం పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. అప్పట్లో డీలర్లతో పాటు ఒక సీఐ కూడా అడ్డంగా దొరికిపోయి సస్పెండయ్యారు. ఆ ఘటన మరువకముందే నగరంలో మరో రేవ్‌పార్టీకి తెరతీయడం కల్లోలం రేపుతుంది.

English Title
Rave party is uncomfortable in Kurnool
Related News