ర‌వితేజ కొత్త చిత్రం ఫ‌స్ట్ లుక్ ఎప్పుడంటే..

Updated By ManamTue, 03/13/2018 - 18:50
ravi teja

ravitejaమాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ‘నేల టికెట్’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ఏమిటనే విషయంలో పూర్తి క్లారిటీ వస్తుంది. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతమందిస్తున్నారు.

English Title
ravi teja new movie's first look update
Related News