రవితేజ తదుపరి చిత్రం విశేషాలు

Updated By ManamSat, 09/08/2018 - 11:29
Raviteja

Ravitejaప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ ఆ తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులుగా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు పలు చిత్రాలలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించినప్పటికీ తండ్రి, కుమారులుగా చేయలేదు. కిక్2లో చేసినప్పటికీ.. అది సినిమా మొత్తం ఉండదు కాబట్టి మొదటిసారి రవితేజ తండ్రీ కుమారులుగా చేయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

English Title
Ravi Teja next movie details




Related News