రీమేక్ వద్దనుకున్న రవితేజ..?

Updated By ManamThu, 09/20/2018 - 12:31
Ravi Teja

Ravi Teja, Santhosh Srinivas‘రాజా ది గ్రేట్‌’తో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన రవితేజ.. ఆ తరువాత ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’ చిత్రాలతో రెండు వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రంలో నటిస్తున్న రవితేజ.. ఆ తరువాత సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించిన తెరి రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్‌పై రవితేజ అంత ఆసక్తిని చూపనట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం తమిళ్‌లో పాటు తెలుగులో పోలీసోడు అనే పేరుతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాగా.. మనవారిని అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ చిత్ర రీమేక్‌ చేసినా.. పెద్ద విజయం సాధించదని భావించిన రవితేజ.. మరో కథను రెడీ చేయమని సంతోశ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రవితేజ కోరిక మేరకు సంతోశ్ మరో కథను సిద్ధం చేసినట్లు కూడా టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా రోజున ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
Ravi Teja not interest on remake..?
Related News