ముగ్గురు కాదు.. ఒకరేనా..! 

Updated By ManamMon, 09/10/2018 - 15:15
AAA

AAA'వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాల తర్వాత' రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలను పోషిస్తారని అందరూ అనుకున్నారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రవితేజ మూడు గెటప్స్‌ను విడుదల చేశారు. కానీ సినిమాలో రవితేజ ఒకడేనట. మూడు షేడ్స్‌లో కనపడతారట. లెటెస్ట్‌ సమాచారం ప్రకారం రవితేజ మల్లిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపుడుతుంటారట. దాని కారణంగా తనకు తెలియకుండా అమర్‌ , అక్బర్‌, ఆంటోని క్యారెక్టర్స్‌గా మారిపోతుంటారట. దీని కారణంగా సన్నివేశాల్లో వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని సమాచారం. అక్టోబర్‌లో విడుదల కాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. 

English Title
Ravi Teja not playing triple role..!
Related News