రాయుడు రెడీ..

Updated By ManamFri, 04/27/2018 - 02:31
RAYUDU
  • టీమిండియాలో రీ ఎంట్రీపై ఆశలు   

  • సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న హైదరాబాదీ

ఆమోఘైమెన ఆట.. కొడితే సిక్స్..లేదంటే ఫోర్... ఈ పొగడ్తలు ధోనీ గురించి మాత్రం కాదు... చెనై సూపర్ కింగ్స్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న హైదరాబాదీ అంబటి రాయుడు గురించి.  అగ్రశేణి ఆటగాళ్లతో పోటీపడుతూ  2018 ఐపీఎల్‌లో సూపర్ స్టార్  అయిపోయిన రాయుడు ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో ఆడే భారత  జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.  జట్టులో చోటివ్వటానికి ఇంతకంటే ఇంకేం కావాలని  చెబుతున్నాడు.
 
imageహైదరాబాద్:  సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో  ఐపీఎల్‌లో బ్రహ్మాండంగా రాణిస్తున్న చెన్నై సూపర్‌కింగ్స్ స్టార్, హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడు భారత  జట్టులో రీ ఎంట్రీకి దగ్గరయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడే భారత జట్టు సెలెక్ష న్ రేస్‌లో తానూ ఉన్నానని ఐపీఎల్‌లో ఆటతీరుతో  రాయుడు  నిరూపించాడు.  వచ్చేనెల్లో భారత  జట్టు ఇంగ్లండ్‌తో సుదీర్ఘ పర్యటనలో ఆడుతుంది. ఆ సీజన్‌లో మూడు టీ20లు,  ఆరు వన్డేల్లో భారత్ ఇంగ్లండ్‌తో పోటీపడుతుంది. ఈ టూర్ కోసం భారత జట్టు ఎంపిక త్వరలో జరగనుండటంతో ఇప్పుడు రాయుడు పేరు కూడా వినిపిస్తోంది.   భారత జట్టు మిడిలార్డర్ ఆటగాళ్లు మనీష్ పాండే, కేదార్ జాదవ్‌లకు ఏమాత్రం తీసిపోనని ఐపీఎల్‌లో అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడుతూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.   బెంగళూరుతో  బుధవారం జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై విరుచుకుపడ్డ రాయుడు 8 సిక్స్‌లు, మూడు ఫోర్లతో 82 పరుగులు చేసి అహో అనిపించాడు.  చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.  రాయుడు పెర్ఫార్మెన్స్ అధ్భుతంగా ఉందని టీమిం డియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ‘ రాయుడు నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ముందే  ఊహిం చా’ అని ప్రసాద్ చెప్పాడు.   సూప ర్ ఇన్నింగ్స్‌తో ఆడుతున్న రాయు డు పేరును పరిశీలిస్తామని చెప్పా డు. ఇంతకు  ముందు భారతజట్టుకు 24 వన్డేలు ఆడిన రాయుడు  రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో  1055 పరుగులు చేశాడు. 2016 జూన్‌లో జింబాబ్వేతో జరిగిన  సిరీస్‌లో చివరి సారిగా వన్డే ఆడిన రాయుడు ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు.    హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్నప్పుడు ఆంధ్రపై  సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టిన ఇన్నింగ్స్‌ను  ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. 

అండర్-15 జట్టుకు ఆడుతున్నప్పుడు రాయుడులోని ప్రతిభను గుర్తించిన అప్పటి కోచ్ రోజర్ బిన్నీ బీసీసీఐకి ప్రత్యేకంగా లేఖ రాశాడు. ఇప్పుడ రాయుడు ఆడుతున్న ఆట చూస్తుంటే భారత జట్టులో చోటు దక్కటం ఖాయంగా కనిపిస్తోందని మాజీ స్పిన్నర్, కామెంటేటర్ ఎల్ శివరామకృష్ణన్ అన్నాడు. ‘ రాయుడు సెన్సేషనల్ ఇన్సింగ్స్ ఆక ట్టుకునేరీతిలో ఉన్నాయి, రాయుడు బ్యాటింగ్ మహాదూకుడుగా ఉంది, బ్యాటింగ్ స్టైల్, బౌలర్లను ఎదుర్కొంటున్న తీరు అద్భుతం’ అని శివరామకృష్ణన్ ప్రశంసించాడు. గాయం కారణంగా గతంలో భారత జట్టుకు దూరైమెన రాయుడిని సెలెక్టర్లు మరచిపోయారు. అయితే ఇప్పుడు మాత్రం తనను పదే పదే గుర్తుంచుకునేలా సూపర్ ఇన్నింగ్స్‌తో  రాయుడు చెలరేగిపోతూ సెలెక్టర్లకి పని చెప్పాడు.

English Title
RAYUDU Ready
Related News