పీఎన్‌బీ ఎఫెక్ట్: ఎల్వోయూ, ఎల్వోసీలు రద్దు

Updated By ManamWed, 03/14/2018 - 10:48
rbi representational

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో దేశంలోని ఏ బ్యాంకు కూడా లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ), లెటర్స్ ఆఫ్ కంఫర్ట్ (ఎల్వోసీ)లను జారీ చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. విదేశీ ద్రవ్యాన్ని మార్చడం కోసం దేశీయ దిగుమతిదారులకు బ్యాంకులు ఇచ్చే ఆమోద పత్రాలే ఈ ఎల్వోయూలు, ఎల్వోసీలు. ఎల్వోయూలతో వజ్ర వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీలు పీఎన్బీకి 12,700 కోట్ల రూపాయలు టోకరా కొట్టిన రెండు నెలలకు ఆర్బీఐ వాటిని రద్దు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశీయ దిగుమతులపై భారీగానే భారం పడనుంది. రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో దేశీయ దిగుమతులపై ఇప్పుడున్న పన్నే వర్తిస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. కాగా, మంగళవారం ఎల్వోయూలు, ఎల్వోసీలను జారీ చేయరాదని పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేసిన ఆర్బీఐ.. వెంటనే ఆ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

English Title
RBI Cancels All LoUs and LoCsRelated News