ఆర్బీఐది నీలకంఠుడి పాత్ర

Updated By ManamWed, 03/14/2018 - 21:31
URJITH

IMAGEగాంధీనగర్: బ్యాంకులలో మోసాలు ఒక్కటొక్కటిగా బయుటపడుతూండడంపై ఆర్.బి.ఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తీవ్ర వేదన వ్యక్తపరచారు. శివుడు హాలాహలాన్ని గొంతు మధ్యలో ఉంచుకొని నీలకంఠుడయ్యాడు. అదే మాదిరిగా, కేంద్ర బ్యాంక్ కూడా ఈ గరళాన్ని మింగినా వివుర్శలను ఎదుర్కొంటోంది. కానీ, సవాళ్ళను అధిగమించే ప్రయత్నం నిలకడగా కొనసాగిస్తూ బ్యాంక్ మెరుగైన స్థితిని సృష్టించే దిశగానే సాగుతోందని ఆయన ఉపమానం చెప్పుకొచ్చారు. పి.ఎన్.బి.లో సంభవించిన రూ. 12,967 కోట్ల కుంభకోణంపై ఆయన ఎట్టకేలకు మౌనం వీడి, కేంద్ర బ్యాంక్  పడుతున్న క్షోభను వివరించారు. ‘‘బ్యాంకింగ్ రంగ మోసాలు, అవకతవకలు, అక్రమాలపై రిజర్వ్ బ్యాంక్‌లో ఉన్న మేం కూడా కోపంతో, బాధతో, వేదనతో ఉన్నామని నేను ఈ రోజు తెలియుజేయుదలచుకున్నాను’’ అని ఆయన అన్నారు. గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీలో చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశంపై తన బాధను వెళ్ళగక్కారు. ‘‘సూటిగా, సరళంగా చెప్పాలంటే, వారు అనుసరించిన పద్ధతులు, వ్యాపార వర్గంలోని కొందరు, కొందరు నాయుకుల వ్యాపార భాగస్వామ్య సంస్థలతో కలసి దేశ భవిష్యత్తును లూటీ చేయుడంతో సమానం కిందకు వస్తాయి’’ అని ఆయన అన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతా సమీక్షకు ఆర్.బి.ఐ వద్ద ఒక పద్ధతి ఉందని పటేల్ అన్నారు. ‘‘ఈ అపవిత్ర పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు మేం చేయుగలిగిన దంతా చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు. దేశ రుణ సంస్కృతిని ప్రక్షాళన చేసే పనిని ఆర్.బి.ఐ చేపట్టిందని ఆయన చెప్పారు. దీన్ని ఆయన క్షీర సాగర మథనంతో పోల్చారు. ఆధునిక యుగ భారతీయ ఆర్థిక వ్యవస్థ అనే సముద్రాన్ని రుణ సంస్కృతి అనే మందర పర్వతంతో చిలుకుతున్నామని చెప్పారు. ఈ మథనం పూర్తయి, దేశ భవిష్యత్తుకు స్థిరత్వమనే అమృతాన్ని సురక్షితంగా బయుటకు తీసుకువచ్చేంత వరకు, ఆ క్రమంలో పుట్టుకొస్తున్న విషాన్ని ఎవరో ఒకరు మింగక తప్పదని ఆయన అన్నారు. ‘‘వివుర్శలను ఎదుర్కొంటూ కూడా, ఈ గరళాన్ని గొంతులో ఉంచి, నీలకంఠుడిగా వ్యవహరించవలసిన అవసరం ఉందనుకున్నప్పుడు, దాన్ని మేం మా కర్తవ్యంగా నిర్వహిస్తాం. ఓర్పుతో ప్రయుత్నాలు సాగిస్తాం. దారిలో ఎన్ని విషమ పరీక్షలు ఎదుైరెనా ఎదుర్కొంటాం. రాటుదేలి మెరుగైన స్థితిని ఏర్పరుస్తాం’’ అని ఆర్.బి.ఐ గవర్నర్ స్పష్టం చేశారు. మరింత మంది ప్రమోటర్లు, బ్యాంకులు విడివిడిగాగానీ లేదా తమ పరిశ్రమల రంగ సంస్థల ద్వారా సవుష్టిగాగానీ ‘‘ఈ అమృత మథనంలో అసురుల వైపు కాకుండా దేవతల వైపు’’ ఉండేట్లుగా తమ వైఖరిని పునః పరిశీలించుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘బ్యాంకు యాజమాన్యం, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మధ్య సమాన పోటీ అవకాశాలు కల్పించడం విషయంలో బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అధికారాలను తటస్థం చేయా’’లని ఆయన వాదించారు. మోసం బయుటపడ్డ తర్వాత వెలువడిన ప్రకటనల్లో, ఆర్.బి.ఐ పర్యవేక్షక బృందం దాన్ని పట్టుకొని ఉండాల్సిందనే ధోరణి కనిపించింది. కానీ, ఏ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థా అన్ని మోసాలను పసిగట్టడంకానీ లేదా నివారించడంకానీ చేయులేదని పటేల్ స్పష్టం చేశారు. ‘‘ఏ రకైమెన మోసం బయుటపడిన తర్వాతైనెనా, ఆ రకైమెన మాటలు వినిపించడం ఎప్పుడూ మామూలే. కానీ, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని ప్రతి మూలను పరిశీలించడం నియంత్రణ సంస్థకు సాధ్యం కాని పని. ‘పరిశీలన పూర్తయింది’ ఇక మోసాలకు అవకాశం లేదని తోసిపుచ్చలేం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

సైబర్ రిస్క్ అంశాలను ఆధారం చేసుకుని, నిర్వహణాపరైమెన ప్రమాదం సరిగ్గా ఎక్కడ ఉందో ఆర్.బి.ఐ గుర్తించగలిగిందని పి.ఎన్.బి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్పారు. మోసాన్ని ఎలా కొనసాగిస్తూ వచ్చారో ఇప్పుడు ‘‘మేం అర్థం చేసుకున్నాం’’ అని పటేల్ అన్నారు. బ్యాంకులు ఈ ప్రమాదాన్ని అరికట్టగలిగే విధంగా,  2016లో నిశిత, నిర్దిష్ట ఆదేశాలు, సూచనలతో మూడు సర్క్యులర్లను ఆర్.బి.ఐ జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ‘‘కానీ, బ్యాంకు వాటిని ఖాతరు చేయులేదని మోసం బయుటపడ్డ తర్వాత తేలింది. లొసుగును చక్కదిద్దుకునేందుకు స్పష్టైమెన సూచనలు ఉన్నప్పటికీ, ఆ లోటును పూడ్చడంలో బ్యాంకులోని అంతర్గత ప్రక్రియలు విఫలవుయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు’’ అని పటేల్ అన్నారు. బ్యాంకుపై చర్య తీసుకునేందుకు ఆర్.బి.ఐకి ఏ మేరకు అధికారం ఉందో ఆ మేరకు చర్య తీసుకుంటుంది. కానీ, ఈ సెట్టు విషయంలో పి.ఎస్.బిలపై బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ఇస్తున్న అధికారాలు పరిమితమని పటేల్ చెప్పారు. విజయాలు తమ చలవేనని చెప్పుకునేవారు ఎప్పుడూ ఎక్కువ మంది ఉంటారు. వైఫల్యాలకు బాధ్యత వహించేవారే ఉండరంటూ గవర్నర్, ఎప్పటిలానే నిందను ఒకరి మీద ఒకరు నెట్టుకునే క్రీడ మొదైలెందని చెప్పారు. బ్యాంకుల స్ట్రెస్సడ్ ఎసెట్లు రూ. 8.5 లక్షల కోట్ల కన్నా ఎక్కువే ఉంటాయని ఆయన అన్నారు. 

English Title
The RBI is the role of Neelakanta
Related News