అమితాబ్‌ అస్వస్థతకు కారణమిదే

Updated By ManamWed, 03/14/2018 - 10:59
Amitabh

Amitabh Bachchan, Jaya Bachchan'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా షూటింగ్‌లో పాల్గొన్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మంగళవారం ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం బిగ్‌బీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బీ అస్వస్థతపై అతడి భార్య జయా బచ్చన్ స్పందించారు.

భారీ కాస్ట్యూమ్స్‌ను ధరించడం వలనే బిగ్‌బీ వెన్నులో నొప్పి వచ్చింది.. అంతకుమించి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపింది. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ కోసం బిగ్‌బీ చాలా కష్టపడుతున్నారు. ఇందులో విభిన్న పాత్రలో నటిస్తున్న బిగ్‌బీ అందుకోసం భారీ కాస్ట్యూమ్స్‌ను గంటల పాటు వేసుకుంటున్నారు. దీని వలనే అతడు తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నారు.

Amitabh

 

English Title
Reason behind Amitabh illness
Related News