చిరు బరువు పెరగడానికి కారణం అదేనా..?

Updated By ManamTue, 06/19/2018 - 13:03
chiru

Chiru  ‘ఖైదీ నంబర్.150’తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇదంతా పక్కనపెడితే ఇటీవల పలు కార్యక్రమాలలో చిరు బాగా బరువు పెరిగినట్లు కనిపించారు. దీంతో ఉన్నట్లుండి చిరు అంత బరువు ఎందుకు పెరుగుతున్నారా..? అనే సందేహం మొదలైంది.

అయితే సైరా చిత్రం కోసమే చిరు బరువు పెరిగారట. సినిమాలోని ఫ్లాష్ బ్యాక్‌లో ఎపిసోడ్‌లలో చిరు వయసు మళ్లిన పాత్రలో నటించనున్నాడట. అందుకోసమే అతడు బరువు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

English Title
Reason behind Chiru's weight
Related News