హరికృష్ణ మృతికి కారణాలు ఇవేనా..?

Updated By ManamWed, 08/29/2018 - 08:52
Harikrishna

Harikrishnaనటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతికి అతివేగమే కారణమా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో ఆయన గంటకు 160కిలోమీటర్ల వేగంతో స్వయంగా కారును నడిపినట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదంలో కారు పల్టీలు కొట్టగా, హరికృష్ణ ఛాతీ స్టీరింగ్‌కు బలంగా తగిలిందని, ఆ తరువాత ఆయన కారులోంచి కిందపడగా, బలమైన గాయమై మెదడు చిట్లిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఆ తరువాత ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని, అత్యవసర వైద్య చికిత్సలు చేసినా హరికృష్ణ ప్రాణాలు నిలబడలేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో నలుగురు ఉండగా.. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

English Title
Reasons behind Harikrishna death
Related News