సడలిన టోకు ద్రవ్యోల్బణం

Updated By ManamWed, 03/14/2018 - 23:06
Wholesale-Inflation

Wholesale-Inflationన్యూఢిల్లీ: భారతదేశపు వార్షిక టోకు ధర ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత, వరుసగా మూడవ నెలలో ఫిబ్రవరిలో సడలింది. ఆహార, ఇంధన ధరల్లో నామమాత్రపు పెరుగుదల ఈ స్థితికి సహాయపడినట్లు ప్రభుత్వ డాటా బుధవారంనాడు వెల్లడించింది. వార్షిక టోకు ధర ద్రవ్యోల్బణం జనవరిలో తాత్కాలికంగా 2.84 శాతానికి పెరిగిన తర్వాత ఫిబ్రవరిలో 2.48 శాతానికి తగ్గినట్లు వెల్లడైంది. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో టోకు ఆహార ధరలు 0.07 శాతం పెరిగాయి. జనవరి నెలలో ఇది 1.65 శాతంగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం గత కనిష్ఠ స్థితి జూలైలో 1.88 శాతంగా ఉంది. ఆహార వస్తువులపై ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 3 శాతం నుంచి ఫిబ్రవరిలో 0. 88 శాతానికి తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. వీటి విషయంలో వార్షిక ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 40.77 శాతం నుంచి ఫిబ్రవరిలో 15.26 శాతానికి తగ్గింది. ఉల్లిపాయల్లో ధరల పెరుగుదల రేటు మందగించగా, మరో ముఖ్యమైన వంట సరకు బంగాళా దుంపల విషయంలో పెరిగింది. పప్పు ధాన్యాలు, తృణ ధా న్యాలు, గోధువుల రేటుతోపాటు గుడ్లు, చేపలు, మాంసం ధరలు కూడా తగ్గాయి. ఇంధనం, వి ద్యుత్ ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 4.08 నుంచి ఫిబ్రవరిలో 3.81 శాతానికి సడలింది. 

English Title
Relaxed wholesale inflation
Related News