‘2.O’ టీజర్‌కు ముహూర్తం ఖరారు

Updated By ManamSat, 09/08/2018 - 12:24
2.O

2.Oరజనీకాంత్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ‘2.O’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టీజర్‌కు ముహూర్తం ఖరారు చేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ నెల 13న ‘2.O’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో రజనీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన 2.O గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గ్రాఫిక్స్‌ పనుల్లో జాప్యం కారణంగా ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. దీంతో ఈ చిత్రం విడుదల తేదిపై పలు అనుమానాలు వినిపిస్తూ వచ్చాయి. అయితే వాటన్నింటిని ఖండిస్తూ నవంబర్ 29న విడుదల తేదిన ప్రకటించిన దర్శకుడు శంకర్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు వస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే.

English Title
Release date fix for 2.O teaser




Related News