‘శైలజా రెడ్డి అల్లుడు’కు ముహూర్తం ఫిక్స్

Updated By ManamMon, 07/30/2018 - 13:00
Sailaja Reddy Alludu

Sailaja Reddy Alludu నాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్‌గా నటించగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి విడుదల తేది ఖరారు అయ్యింది. ఆగష్టు 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. ఇక త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. 

English Title
Release date fix for Sailaja Reddy Alludu
Related News